Subscribe Us

Double Surprise loading for Ramcharan Fans!!


స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలకు అభిమానులు ఏం కోరుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలకు సంబంధించిన ఎదో ఒక స్పెషల్ అప్డేట్ రావాల్సిందే. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు కాబట్టి  పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా బ్యాక్ టూ బ్యాక్ సర్ ప్రైజ్ లు రావచ్చని సమాచారం.

మార్చ్ 27న రామ్ చరణ్ 36వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. అయితే ఆ స్పెషల్ డే రోజు ముందుగా శంకర్ సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా ఏదో ఒక సర్ ప్రైజ్ అయితే ఇవ్వకుండా ఉండడు. గత ఏడాది RRR కు సంబంధించిన టీజర్ వచ్చింది కాబట్టి ఈ సారి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు ఆచార్య సినిమాకు సంబంధించిన లుక్ కూడా రావచ్చని సమాచారం.



Post a Comment

0 Comments