వేదం నాగయ్య కన్నుమూత!!


వేదం సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నాగయ్య ఇకలేరు. క్రిష్ దర్శకత్వంలో 2011లో వచ్చిన వేదం సినిమాలో రాములు అనే పాతలో నటించిన నాగయ్య ఆడియెన్స్ కు ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా తరువాత నాగవల్లి’, ‘ఒక్కడినే’, ‘రామయ్య వస్తావయ్యా’, ‘స్పైడర్’ వంటి సినిమాల్లో కూడా కొన్ని చిన్న చిన్న రోల్స్ చేశారు.

మొదట మూడువేల పారితోషికం అందుకున్న నాగయ్య సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా, న‌ర్స‌రావు పేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామానికి చెందిన నాగ‌య్యకు చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. దర్శకుడు క్రిష్ అతనికి వేదం సినిమాలో మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్పట్లో కేటీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మా అసోసియేషన్ నుంచి 2500రూపాయలు ప్రతి నెల పింఛన్ కూడా అందుకుంటున్నాడు. ఇక ఆయన మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.Post a Comment

Previous Post Next Post