రానా నెంబర్ 1 యారీకి రాబోయే స్టార్స్ వీళ్లే!!


టాలీవుడ్ లో స్టార్ హీరోల రియాలిటీ షోలకు ఏ రేంజ్ లో క్రేజ్ అందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాగార్జున బిగ్ బాస్ అనంతరం మరిన్ని రియాలిటీ షోలతో హీరోలు సందడి చేయబోతున్నారు. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక రానా నెంబర్ 1 యారితో బిజీగా మారబోతున్నాడు. ఆ షో ప్రతి సీజన్ హిట్టయ్యింది. 


ఇక సీజన్ 3లో ఇప్పటికే జాతిరత్నాలు స్టార్స్ తో ఆహా యాప్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో మరికొందరు స్టార్ సెలబ్రెటీలు రాబోతున్నట్లు సమాచారం. సీజన్ 1, 2లలోనే రానా చాలా వరకు స్టార్స్ ను కవర్ చేసేశాడు. అగ్ర హీరోలను రప్పించి మంచి రేటింగ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , వెంకటేష్, తమన్నా భాటియా వంటి స్టార్స్ ను షోకు పిలవనున్నట్లు తెలుస్తోంది. వారం వారం సినిమాలను బట్టి స్టార్స్ ప్రమోషన్ లో భాగంగా యారీ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.Post a Comment

Previous Post Next Post