Subscribe Us

First Look: Prabhas as Rama On this date?


టాలీవుడ్ రెబల్ స్టార్ బాహుబలి అనంతరం చేస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాపై హైప్ భారీగానే క్రియేట్ అయ్యింది. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు.

అయితే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పై త్వరలోనే ఒక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ ఫస్ట్ లుక్ ను వచ్చే నెల శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం కొంత గ్యాప్ తీసుకొని మరొక షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.Post a Comment

0 Comments