జాతిరత్నాలు సినిమాపై రోజురోజుకు హైప్ మరింత పెరుగుతోంది. షూటింగ్ మొదలైనప్పుడు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏమి క్రియేట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే చిట్టి సాంగ్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి అంచనాల డోస్ పెరిగిపోయాయి. ఇక టీజర్ మరో బూస్ట్ ఇవ్వగా ప్రభాస్ ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేయించి మరింత హైప్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో జాతిరత్నాలు ట్యాగ్ నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా వైరల్ అవుతోంది.
ఇక ఆ క్రేజ్ వల్ల సినిమా బిజినెస్ కూడా గట్టిగానే పెరుగుతోంది.ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం 12కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. అంతకంటే ఎక్కువ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూస్తుంటే సినిమా మొదటి వారమే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేలా ఉందని అనిపిస్తోంది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించగా పిట్టగొడ దర్శకుడు అను దీప్ డైరెక్ట్ చేశాడు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. మార్చ్ 11న సినిమాను విడుదల చేయనున్నారు.
Follow @TBO_Updates
Post a Comment