పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ సినిమాపై హైప్ మామూలుగా లేదు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఆ హిస్టారికల్ కథపై రోజుకో రూమర్ అంచనాలను పెంచేస్తోంది. సినిమా షూటింగ్ అయితే నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. దర్శకుడు క్రిష్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సమయానికి తగ్గట్లుగా షూటింగ్ పనులను ఫినిష్ చేస్తున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన టీజర్, టైటిల్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మహాశివరాత్రి సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ రానున్నట్లు సమాచారం. మార్చ్ 11న టీజర్ రిలీజ్ పై కూడా క్లారిటీ ఇవ్వవచ్చని టాక్ అయితే వస్తోంది. త్వరలోనే నిర్మాత ఈ విషయంపై అధికారికంగా వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 17వ శతాబ్దంలో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. దర్శకుడు క్రిష్ గతంలో గౌతమి పుత్ర శతకర్ణితో ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అంతకంటే హై రేంజ్ లో ఉండేలా పవన్ కళ్యాణ్ సినిమాను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment