అల్లరి నరేష్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అసలైన హిట్ అందుకున్నాడు. దాదాపు 8 ఏళ్ల అనంతరం నాంది సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ఇంకా ఉందని నిరూపించాడు. ఇక రెగ్యులర్ కామెడీ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాత్మకమైన కథలను కూడా తెరపైకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యాడు. అయితే నరేష్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందని అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే దిల్ రాజు ఒక ఆఫర్ ఇచ్చేశాడు. మంచి కథ ఉంటే సెట్ చేసుకోమ్మని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నరేష్ నెక్స్ట్ సినిమాను కూడా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ హిట్ కాంబినేషన్ దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. నాంది దర్శకుడికి ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయట. కానీ దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో రెండవసారి కూడా నరేష్ తోనే సినిమా చేయాలని విజయ్ ఫిక్స్ అయినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment