టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ మూవీ ఆచార్య కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబందించిన మరో సర్ ప్రైజ్ ను చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సిద్దా అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్ సినిమాపై అంచనాల డోస్ ను పెంచేసింది.
ఇక సినిమాకు సంబందించిన సాంగ్స్ కూడా విడుదల చేయాలని రెడీ అయ్యారు. మణిశర్మ బాణీలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో ఒక అద్భుతమైన డేవోషనల్ సాంగ్ ఉంటుందట. ఇక ఆ లిరికల్ పాటను శివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. సాంగ్ లో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా కనిపిస్తాడని సమాచారం. మెగాస్టార్ మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ చాలా వరకు హిట్టయ్యాయి. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
Post a Comment