టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం రంగస్థలం. 200కోట్లకు పైగా వసూళ్లను అందుకొని నటుడిగా కూడా చరణ్ స్థాయిని పెంచింది ఆ సినిమా. అయితే ఆ కాంబో మరోసారి కలవనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇక పుట్టినరోజు సందర్భంగా అల్లూరి ఫస్ట్ లుక్ తో పాటు ఆచార్య కామ్రేడ్ సిద్దా లుక్ కూడా వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో సుకుమార్ రామ్ చరణ్ కాంబో మళ్ళీ కలిసే ఛాన్స్ ఉన్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ పుష్ప అనంతరం విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత సుక్కు మళ్ళీ రామ్ చరణ్ తో చేయవచ్చని తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment