శంకర్ కు 'అపరిచితుడు' దెబ్బ.. నిర్మత నోటీసులు!! - TollywoodBoxoffice.in

Exclusive Portal for Boxoffice Collections

శంకర్ కు 'అపరిచితుడు' దెబ్బ.. నిర్మత నోటీసులు!!
డైరెక్టర్ శంకర్ షణ్ముగం మరోసారి లీగల్ నోటీసులు అందుకోబోతున్నారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో అపరిచితుడు ఒకటి. ఆస్కార్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో రవిచంద్రన్ నిర్మాతగా రూపొందిన ఆ సినిమా 2005లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమా కథ ఆధారంగా బాలీవుడ్ లో మరో అపరిచితుడు సినిమాను తెరకెక్కించడానికి శంకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా జయంతి లాల్ నిర్మాతగా పెన్ స్టూడియోస్ పై సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అయితే అపరిచితుడు మొదటి నిర్మాత అయిన v రవిచంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ కథపై సర్వ హక్కులు తనవే అని తన అనుమతి లేకుండా సినిమాను ఎలా మొదలు పెడతారు అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మరి ఆ హెచ్చరికలపై శంకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.