దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమా విడుదల తేదీపై రోజుకో రూమర్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నాయి. అసలు సినిమా చెప్పిన డేట్ కు వస్తుందా లేదా అనేది షూటింగ్ పూర్తయ్యేవరకు తేలేలా లేదు అని కొన్ని గాసిప్స్ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల సినిమాకు వర్క్ చేస్తున్న ఒకరిని సంప్రధించగా రిలీజ్ డేట్ మార్చే విషయంలో ఇప్పటి వరకు అయితే ఎలాంటి చర్చలు జరగలేదు అని అక్టోబర్ 13న విడుదల చేయాలన్న టార్గెట్ తోనే రాజమౌళి వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ఉగాది సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో కూడా అక్టోబర్ 13 అనే మెన్షన్ చేశారు. కాబట్టి రిలీజ్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఇక త్వరలోనే కీరవాణి తన తొలి సాంగ్ ను వధలబోతున్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment