ఫన్ బకెట్ భార్గవ్ కేసు.. స్పందించిన OMG నిత్య శ్రీ!!


ఫన్ బకెట్ భార్గవ్ ఇటీవల దిశ కేసులో అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు నిజమా అబద్దమా అనే కన్ఫ్యూజన్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తానికి ఆ ఘటనపై ఫన్ బకెట్ సహచరులు స్పందించడంతో నిజం బయటకు వచ్చింది. 14 ఏళ్ళ అమ్మాయిపై భార్గవ్ మద్యం మత్తులో అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.


అయితే ఈ విషయంపై ఓ మై గాడ్ గర్ల్ నిత్య శ్రీ స్పంధించింది. గతంలో నిత్య ఫన్ బకెట్ లోనే కాకుండా టిక్ టాక్ వంటి వాటిలలో భార్గవ్ తో కలిసి కామెడీ క్లిప్స్ లో యాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పేరు కూడా వైరల్ అవ్వడంతో మొత్తానికి క్లారిటీ ఇచ్చింది. తనకు భార్గవ్ తో ఎలాంటి సంబంధం లేదని సోషల్ మీడియా ద్వారానే ఆ విషయం నాకు తెలిసిందని చెప్పింది, అలాగే తనతో ఇప్పుడు నేను వీడియోలు చేయట్లేదు అంటూ భార్గవ్ ను కలిసి కూడా దాదాపు ఏడాది అయ్యింది.. అనవసరంగా రూమర్స్ నమ్మవద్దు. నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు.. అని నిత్య వివరణ ఇచ్చింది.


Post a Comment

Previous Post Next Post