తెలంగాణలో థియేటర్స్ బంద్!


రేపటి నుంచి తెలంగాణలో కూడా సినిమా థియేటర్లు బంద్ మొదలు కానుంది. సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు  తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 50% ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు కొనసాగుతాయని కీలక అదేశాలు జారీ చేయగా ఇప్పుడు స్వతహగ తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఏకంగా థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో కోవిడ్ తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post