ప్రభాస్.. ఈ నమ్మక ద్రోహం ఎవరిది?


రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే రాధేశ్యామ్ అప్డేట్స్ విషయంలో స్లోగా అడుగులు వేయడంతో అభిమానులు యూవీ ప్రొడక్షన్ మీద ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ టీమ్ పై కూడా ఓ వర్గం అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు.

రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా అప్డేట్ శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రిలీజ్ కానుందని ఒక ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. నిజానికి చిత్ర యూనిట్ అఫీషియల్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. అయితే అలాంటప్పుడు గాసిప్ నేషనల్ వైడ్ గా వైరల్ అవుతున్నప్పుడు కొంత అయినా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నిజానికి ఆదిపురుష్ లాంటి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి శ్రీరామనవమి కంటే మంచి రోజు మరొకటి ఉండదు. అలాంటిది ఈ స్పెషల్ డేను లైట్ తీసుకోవడం కూడా అభిమానులకు నచ్చట్లేదు..


Post a Comment

Previous Post Next Post