Anushka Shocking Look.. Here is the Reason!


టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి బాహుబలి అనంతరం కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటోంది. రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలను మాత్రమే చేయడానికి ఒప్పుకుంటోంది. ఇక బాగమతి, నిశ్శబ్దం అనంతరం కాస్త స్పీడ్ పెంచిందని అనుకుంటే అమ్మడు మళ్ళీ ఎప్పటిలానే నెమ్మదిగా అడుగులు వేస్తోంది.

ఇక ప్రస్తుతం అనుష్క చబ్బీగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనుష్క కావాలని అలా అవ్వలేదట  నెక్స్ట్ అమ్మడు నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక సినిమాలో 40ఏళ్ళ వయసు పైబడిన పెళ్లికాని అమ్మాయిలా కనిపించాలని కాస్త చబ్బీగా మారిందట. ఇక నవీన్ పాతికేళ్ళ కుర్రాడిగా కనిపించనున్నాడు. అయితే పాత్ర కోసం కాస్త చబ్బీగా మరే క్రమంలో కాస్త తేడా కొట్టిందట. ఇక ఇప్పుడు వర్కౌట్స్ తో మళ్ళీ సెట్ చేసుకునే పనిలో పడినట్లు సమాచారం. ఒక పెద్ద వయసు కకిగిన మహిళ, అలాగే యంగ్ కుర్రాడి మధ్య సాగే ప్రేమ కథగా ఆ సినిమా ఉంటుందట.


Post a Comment

Previous Post Next Post