EK Mini Katha Movie OTT details!!


కరోనా ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదని కొంతమంది నిర్మాతలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో ఓటీటీ డీల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిన బోల్డ్ మూవీ ఏక్ మినీ కథ ఫైనల్ గా ఓటీటీ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడు నటించిన ఈ సినిమాలో హీరో పురుషాంగం చిన్నగా ఉందని బాధపడుతూ ఉంటాడు. 

టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాను గత నెలలో విడుదల చేయాలని అనుకున్న సమయానికి కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఎలాగైనా థియేటర్స్ తెరచుకున్న తరువాతే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పట్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం లేదని అమెజాన్ ప్రైమ్ తో డీల్ క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.


Post a Comment

Previous Post Next Post