Subscribe Us

Chiranjeevi Donates 1Lakh to TNR family!!


ప్రముఖ యాంకర్, జర్నలిస్టు టీఎన్ఆర్ ఇటీవల కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ కుటుంబానికి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. ఈ సందర్భంగా TNR సతీమణి ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.

మంగళవారం సాయంత్రం ఫోన్ చేసి పరామర్శించారని ఆమె తెలియజేశారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తు చేసినట్లు కూడా వివరణ ఇచ్చారు. ‘మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది’ అంటూ TNR సతీమణి భావోద్వేగానికి లోనయ్యారు.


Post a Comment

0 Comments