Dilraju Spends 300Crs on RamCharan and Vijay!!
Tuesday, May 11, 2021
0
మంచి సక్సెస్ రేటు ఉన్న బెస్ట్ సౌత్ ఇండియన్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. గత 20 ఏళ్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎన్నో విజయాలను చూసిన దిల్ రాజు ప్లాప్ సినిమాను కూడా తెలివిగా రిలీజ్ చేసి నష్టాల నుంచి బయటపడేయగలరు అనే ఒక టాక్ ఉంది. అందుకే శంకర్ తన ప్రతి సినిమాను తెలుగులో దిల్ రాజు ద్వారానే రిలీజ్ చేయిస్తుంటాడు.
ఇక ఈసారి దిల్ రాజు కెరీర్ లోనే మొదటిసారి ఇద్దరిని నమ్మి ప్రొడక్షన్ లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాడు. శంకర్ రామ్ చరణ్ సినిమకు దాదాపు 150 నుండి 200కోట్ల బడ్జెట్ అనుకోగా విజయ్ - వంశీ పైడిపల్లి సినినా కోసం 150కోట్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం. శంకర్, విజయ్ లాంటి బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న వారితో సినిమా చేయడం సేఫ్ అయినప్పటికీ ఏ మాత్రం తేడా వచ్చినా చాలా కష్టమనే కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ కు ఒక్కడికే 90కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాలు ఏ స్థాయిలో హిట్టవుతాయో చూడాలి.
Follow @TBO_Updates
Tags