ఒకేరోజు 3 అప్డేట్స్.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే!టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి కరోనా కారణంగా వెండితెరను మిస్సవ్వాల్సి వస్తోంది. అయితే ప్రతిసారి మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎదో ఒక అప్డేట్ ఇస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈసారి మే 31న సర్కారు వారిపాట ఫస్ట్ లుక్ తో పాటు మేకింగ్ విడియోను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ రెండు అప్డేట్స్ తో పాటు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అదే రోజు రాబోతున్నాయి. అదేరోజు పూజా కార్యక్రమాలతో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు.  ఇక సినిమాకు వర్క్ చేయనున్న టీమ్ సభ్యుల వివరాలను కూడా తెలియజేయనున్నారు.


Post a Comment

Previous Post Next Post