RRR రిలీజ్.. జక్కన్న ఇది మహా దారుణం!!


టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR ఎప్పుడు వస్తుందో అనే ఊహకు అంతే లేకుండా పోతోంది. సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే ఏళ్ళ తరబడి వేయిట్ చేయక తప్పదు అనే విషయం మరోసారి నిజమవుతోంది. కరోనా వల్లే ఆలస్యం అవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే. 

అయితే సినిమా పనులు ఈ ఏడాదిలోనే పూర్తయినా కూడా అంత ఈజీగా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేలా లేదు. దసరా సమయానికి రాదని అర్ధమయ్యింది. ఇక సంక్రాంతికైనా వస్తుందో లేదో అనేది మరొక పెద్ద కన్ఫ్యూజన్. సినిమా బిజినెస్ కూడా చూసుకోవాలి కాబట్టి జక్కన్న సమ్మర్ లోనే విడుదల చేద్దామని అంటుంటే రామ్ చరణ్, తారక్ మాత్రం సంక్రాంతికే ఓటేశరని తెలుస్తోంది. అయితే సంక్రాంతికి రావడానికి మహేష్, పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారు. దీంతో సినిమా రిలీజ్ పై సస్పెన్స్ నెలకొంది. మరి RRR టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post