కొడుకు సినిమాను అడ్డుకున్న నాగార్జున!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ హీరోల లక్కేమిటో గాని బాక్సాఫీస్ హిట్ అనేది ఎవరికి అంత ఈజీగా రావడం లేదు. ముఖ్యంగా అఖిల్ పరిస్థితి ఎలా ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు ఇటీవల నాగార్జున అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఆ సినిమా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ వేశారట. సినిమాలు రిలీజ్ అవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదు. పైగా అఖిల్ సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ అయ్యింది లేదు. అందుకే ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత బన్నీ వాసు, అల్లు అరవింద్ చర్చలు జరువుతుండగా ఎట్టి పరిస్థితుల్లోను అలా జరగకూడదని నాగ్ అడ్డుపడినట్లు సమాచారం. ఎలాగైనా థియేటర్స్ ఓపెన్ అయ్యాకే సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా వివరణ ఇచ్చేసినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post