Two Heroines in Mahesh-Trivikram Movie!!


మహేష్ బాబుకు హీరోయిన్ ను సెట్ చేయాలి అంటే దర్శకులకు అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇండియాలోనే అందమైన హీరోలలో మహేష్ నెంబర్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాంటి అందగాడికి హీరోయిన్ సెట్టయ్యింది అంటే ఆమె అదృష్టం అని చెప్పవచ్చు. ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమా కోసం చాలా ఆలోచిస్తున్నాడు.

ఎప్పటిలానే త్రివిక్రమ్ ఈసారి కూడా ఇద్దరి హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువశాతం త్రివిక్రమ్ సినిమాల్లో హీరో కోసం హీరోయిన్స్ ఎదో ఒక విధంగా గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఒక హీరోయిన్ గా ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకే అయినట్లు టాక్ వచ్చింది. మరొక హీరోయిన్ గా పూజా హెగ్డే అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. అయితే పూజా హెగ్డే వద్దని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. మరి దర్శకుడు త్రివిక్రమ్ ఎలాంటి వారిని ఫైనల్ చేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post