Anushka Latest Pic going Viral!!


టాలీవుడ్ బాక్సాఫీస్ హీరోయిన్ అనుష్క శెట్టి స్టార్ హీరోలకు తీసిపోని విధంగా అభిమానులను పెంచుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈజీగా వసూళ్లను రాబట్టగల సత్తా ఉన్న సోలో హీరోయిన్ అనుష్క. ఇక ఆమె సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేకపోయినప్పటికీ ఎప్పుడైనా ఒక ఫొటో బయటకు వస్తే వెంటనే వైరల్ అవుతుంటుంది.

ఇటీవల అనుష్క ఒక గోడ పక్కన నిలబడి చిన్న స్మైల్ తో స్టిల్ ఇచ్చిన ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఆ గోడపై చార్లీ చాప్లిన్ ఫొటో కూడా ఉంది. అనుష్క చాలా క్యూట్ గా ఉందని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తూ ఆ ఫొటోను మరింత వైరల్ అయ్యేలా షేర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ నవీన్ పొలిశెట్టితో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించబోతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో మహేష్ ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.


Post a Comment

Previous Post Next Post