New Title for Allu Arjun's Pushpa2?


అల్లు అర్జున్ - సుకుమార్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా హడావుడి చూస్తుంటే ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమా నిడివి ఎక్కువ కావడంతో రెండు పార్ట్ లుగా సిద్ధం చేస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ సినిమా సినిమాకు ఎంత గ్యాప్ ఇస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక టైటిల్స్ విషయంలో కూడా సుక్కు కొత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పుష్ప టైటిల్ తో మొదటి భాగాన్ని రిలీజ్ చేసి ఆ తరువాత పుష్ప 2కు మరొక టైటిల్ ను కూడా జత చేయాలని అనుకుంటున్నాడట.  లారెన్స్ మునీ ఫార్మాట్ లగా అన్నమాట. కథలో పెద్దగా మార్పులు చేయకపోయినప్పటికీ రొటీన్ గా పుష్ప 1, పుష్ప 2 అంటే అంత కొత్తగా ఉండదని విభిన్నంగా ట్రై చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. మరి సుక్కు ఎలాంటి న్యూ టైటిల్ సెట్ చేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post