సోనూసూద్ హీరోగా క్రిష్ పాన్ ఇండియా మూవీ!


దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళందరికి కౌంటర్ ఇచ్చేలా హీరో సోనూసూద్ సొంత డబ్బును ఖర్చు చేస్తూ లేని వాళ్లకు సహాయం చేస్తున్నాడు. అతని హీరోయిజం ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోనూసూద్ రియల్ హీరో అవ్వడంతో అతన్ని విలన్స్ పాత్రలకు తీసుకోవడానికి దర్శకులు భయపడుతున్నారు.

అయితే విలన్స్ గా తీసుకోవడం కంటే హీరోగా సినిమా చేస్తే అయిపోతుంది కాదా అని ఆలోచనతో దర్శకుడు క్రిష్ ఒక గొప్ప ప్లాన్ వేసినట్లు టాక్ వస్తోంది. ఇటీవల క్రిష్ సోనూసూద్ కు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో క్రిష్ మణికర్ణిక సినిమా చేసినప్పుడు హీరోయిన్ కంగనా రనౌత్ వలన ఆ సినిమా నుంచి చివరలో సోనూసూద్, క్రిష్ తప్పుకున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post