ప్రభాస్ సైన్స్ ఫిక్షన్.. మరింత ఆలస్యం!


రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా బగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కెరీర్ లో మొదటిసారి అత్యదిక సినిమాలను క్యూలో పెట్టిన డార్లింగ్ ముందుగా రాదేశ్యామ్ ఆ తరువాత సలార్ తో రావాలని ఫిక్స్ అయ్యాడు.

అయితే ఆ తరువాత ప్రాజెక్టులకు డేట్స్ ఇవ్వడంలో ఇబ్బందులు తప్పేలా లేవని నాగ్ అశ్విన్ సినిమాను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ కరోనా ఊహించని దెబ్బ కొట్టేసింది. దీంతో నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టె అవకాశం లేకుండా పోయిందట. అసలైతే జుల్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఇక ఇప్పుడు అక్టోబర్ అనంతరం ఆనుకుంటున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ కి కూడా ప్రాజెక్ట్ ప్లానింగ్ ను క్లియర్ గా సెట్ చేసుకోవాడనికి ఇంకాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కూడా ఆ లోపు రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు


Post a Comment

Previous Post Next Post