Type Here to Get Search Results !

విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలు!!


రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టాలని రెడీ అవుతున్న విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఆల్ మోస్ట్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా అనంతరం విజయ్ మరో రెండు సినిమాలను వెంటవెంటనే పూర్తి చేయవచ్చని టాక్ నడుస్తోంది. 

ఈ ఏడాది అయితే సుకుమార్ తో చేయాల్సిన సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదని పుష్ప 2 ఎనౌన్స్ చేసినప్పుడే అర్ధమయ్యింది. రెండు సినిమాల కోసం సుకుమార్ మరో ఏడాది వేయిట్ చేయవచ్చు. ఇక వచ్చే ఏడాది లేదా 2023 స్టార్టింగ్ లో సుక్కు సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ లోపు ఖాళీగా ఉండకుండా రెండు లేదా మరొక సినిమాను పూర్తి చేసుకోవచ్చని రౌడీ స్టార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies