Prabhas to do 'Sahasam' kind of Action Advantures?


ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా ఫార్మాట్ లోనే తెరకెక్కుతాయని ఎనౌన్స్మెంట్ రాకముందే చెప్పవచ్చు. పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకోవడంతో డార్లింగ్ కటౌట్ కు తగ్గట్టుగానే పవర్ఫుల్ కథలు వస్తున్నాయి. ఇక త్వరలో మరో యాక్షన్ అడ్వెంచర్ లాంటి సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

గతంలో గోపిచంద్ చేసిన సాహసం సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక అదే తరహాలో దర్శకుడి చంద్రశేఖర్ యేలేటి, ప్రభాస్ కోసం తన డ్రీమ్ ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ హీరో, దర్శకుడితో సెపరేట్ గా కామిట్మెంట్ అయితే తీసుకుంది. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ప్రపోజల్ తీసుకువచ్చినట్లు సమాచారం. చంద్రశేఖర్ చెక్ సినిమాతో ఇటీవల డిజాస్టర్ ఎదుర్కొన్నప్పటికీ మంచి టాలెంటెడ్ దర్శకుడు అని సాహసం సినిమాతోనే అర్ధమయ్యింది. మరి ప్రభాస్ తో ఎలాంటి సాహసం చేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post