Nani to do another Sports Drama?
Saturday, May 22, 2021
0
నేచురల్ స్టార్ నాని గత కొన్నాళ్లుగా రెగ్యులర్ కథలకు చాలా గ్యాప్ ఇస్తున్నాడు. రెగ్యులర్ సినిమాలను చేస్తూనే మధ్యమధ్యలో జానర్స్ చేంజ్ చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేసిన జెర్సీ సినిమా ఏ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది.
ఇక మళ్ళీ మరో స్పోర్ట్స్ డ్రామాలో కూడా నటించడానికి నాని ఓకే చెప్పినట్లు టాక్ వస్తోంది. తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఒక ఇష్టమైన దర్శకుడు ఫూట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను చెప్పినట్లు సమాచారం. క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్న నాని కథను మాత్రం మరింత బలంగా మారిస్తే బావుంటుందని సలహా ఇచ్చాడట. ఇక ఆ దర్శకుడు మళ్ళీ ఆ కథపై కూర్చున్నట్లు సమాచారం. ఫుల్ కథ సెట్టయితే ఫూట్ బాల్ కోచింగ్ తీసుకోవడం కాయం.
Follow @TBO_Updates
Tags