Exclusive: RRR కొమురం భీమ్ లుక్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!


జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా RRR నుంచి మొత్తానికి ఒక అద్భుతమైన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ బాడీని చూపించిన జక్కన్న ఈసారి పోస్టర్ లో మరో హై వోల్టేజ్ మాస్ లుక్కును ప్రజెంట్ చేశారు. తారకరామారావు సముద్ర అలలపై బల్లెంతో గురిపెట్టడం అద్భుతంగా ఉంది.

సినిమాలో నీరు అనే పాయింట్ కొమురం భీమ్ కు అలాగే అగ్ని అనే థీమ్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుకు సెట్ చేశారు. ఇక సినిమాలో వాటర్ ఫైట్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని సమాచారం. కొమురం భీమ్ ను బందించినప్పుడు అడవి నుంచి పారిపోతూనే నిజాం యోధులను సైతం ముప్పుతిప్పలు పెట్టిన సీన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందట. చేతిలో ఆయుధం లేకపోయినా కూడా ప్రకృతిని ఆయుధంలా చేసుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇక నీళ్ళల్లో శత్రువు చిక్కితే మొసలి చేతికి చిక్కినట్లే. అంతా బలమైన పాత్రతో రాజమౌళి హై వోల్టేజ్ సీన్స్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను కూడా అంతే బలంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post