Trisha in Balayya-Gopichand Movie!


నందమూరి నటసింహ బాలకృష్ణ లాక్ డౌన్ అనంతరం మళ్ళీ బోయపాటి సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాను వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడు. ఇక మరో వైపు దర్శకుడు గోపీచంద్ కూడా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచుతున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వెళితే ఆ సినిమాకు మరొక సీనియర్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్ నటి మీన ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఇప్పుడు బాలయ్య కోసం త్రిషను కూడా అనుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈసారి కూడా దర్శకుడు క్రాక్ తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఒక ఫ్యాక్షన్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post