త్రివిక్రమ్ తొందరపాటు.. బుచ్చిబాబు చాలెంజ్!


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాడు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పోస్టర్లతో అభిమానులు ఒక రేంజ్ లో ట్రెండ్ చేశారు. ఇక RRR, కొరటాల శివ ప్రాజెక్ట్, ప్రశాంత్ నీల్ మూవీలకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే వచ్చాయి.

ఇక 32వ సినిమా ఎవరితో ఉంటుందో అర్థమైపోయింది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు విషెస్ అందిస్తూనే.. లోకల్ కథను గ్లోబల్ గా చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు ఒక హింట్ ఇచ్చేశాడు. త్రివిక్రమ్ కథ లోకల్ ఫ్యామిలీ డ్రామా కావడంతో తారక్ మధ్యలోనే వదిలేశాడు. పాన్ ఇండియా కథలపై ఫోకస్ పెట్టినట్లు త్రివిక్రమ్ కు సూటిగానే చెప్పినప్పటికీ త్రివిక్రమ్ పెద్దగా ఆలోచించకుండా డ్రాప్ అయ్యాడు. ఇక బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు కూడా ఎన్టీఆర్ అదే మాట అనడంతో అతను ఛాలెంజింగ్ గా తీసుకొని లోకల్ స్పోర్ట్స్  డ్రామాను పాన్ ఇండియా రేంజ్ కథగా మలిచే పనిలో పడ్డాడు. తారక్ అతని కాన్సెప్ట్ పై పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల సినిమా అయిపోతే ఆ సినిమాపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


Post a Comment

Previous Post Next Post