మోహన్ బాబు - రజనీకాంత్ ఫొటోషూట్.. అసలు కారణమిదే!


సినిమా ప్రపంచంలో స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా స్నేహంగా ఉండే స్టార్ట్ హీరోలు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఆయన ఒక్కసారి కనెక్ట్ అయితే అంత ఈజీగా వదిలి పెట్టరు. ఇక మోహన్ బాబుతో ఆయన ఎంత కాలం నుంచి స్నేహంగా ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.


ఇక రీసెంట్ గా మంచు విష్ణు వాళ్లిద్దరితో ఫొటో షూట్ నిర్వహించడంతో రూమర్స్ బాగానే వైరల్ అయ్యాయి. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ అంటూ కామెంట్ కూడా చేశాడు. అయితే ఇటీవల రజనీకాంత్ రామోజీ ఫిల్మ్ సిటీలో అన్నత్తే షూటింగ్  పూర్తి చేసుకున్న అనంతరం డైరెక్ట్ గా మోహన్ బాబు ఇంటికి వెళ్ళాడు. అక్కడే రెండు రోజులు సరదాగా సమయాన్ని గడిపాడు. ఇక మంచు విష్ణు వారిద్దరితో ఇలా ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. మరి భవిష్యత్తులో ఈ పెద రాయుడు కాంబో మరో సినిమాతో వస్తారో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post