Reason for HariHara Viramallu Huge Budget!!


పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హరహర వీరమల్లు అనే టైటిల్ తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇక గతంలో ఎప్పుడు లేని విదంగా పవర్ స్టార్ ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా హై రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం కాయం.

అయితే సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. సినిమాలో గ్రాఫిక్స్ కోసమే 50కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయట. నిర్మాత ఏఎమ్.రత్నం క్రిష్ ఆలోచనలకు తగ్గట్లుగానే మంచి VFX టీమ్ ను రెడీ చేయించినట్లు తెలుస్తోంది. సినిమా కోసం దాదాపు 150కోట్ల వరకు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. అందులో గ్రాఫిక్స్ రియాలిటీకి దగ్గరగా ఉండేలా సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సీన్స్ అభిమానులను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post