మహేష్ ఫ్యాన్స్ గేట్ రెడీ.. బీభత్సమే!


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా స్పెషల్ డే వచ్చింది అంటే స్టార్ హీరోల అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. గ్యాప్ లేకుండా ఎదో ఒక అప్డేట్ తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటారు. ఇక బుదవారం నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ అందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ సిద్ధం కావాల్సిన టైమ్ వచ్చింది.

మహేష్ బాబు ప్రతి ఏడాది మే 31న తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎదో ఒక అప్డేట్ ఇవ్వడం అలవాటుగా వస్తున్నదే. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట అప్డేట్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. మహేష్ బ్యాంక్ మేనేజర్ గా స్పెషల్ లుక్కుతో దర్శనమివ్వబోతున్నాడు. ఆ రోజున త్రివిక్రమ్ సినిమా విశేషాలతో పాటు అనిల్ రావిపూడి సినిమాపై ఎదో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక రాజమౌళి ప్రాజెక్ట్ పై పెద్దగా అప్డేట్స్ ఏమి ఉండకపోవచ్చు.


Post a Comment

Previous Post Next Post