3 కోట్లతో మరో మంచి పని చేస్తున్న సోనూసూద్!!


దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంటే కంటే ఎంతో బాధ్యతగా సేవలను అందిస్తున్న ఏకైక హీరో సోనూసూద్. కరోనా కష్ట కాలంలో మొదటి నుంచి కూడా జనాలకు ఒక హీరో మాదిరిగా నిలుస్తున్న సోనూసూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో వీలైనంత వరకు ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించనున్న సోనూసూద్ ఆంద్రప్రదేశ్ లో కర్నూల్ లోకల్ లో కూడా ఒక భారీ ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఎమ్మెల్యే వంటి అధికారుల నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.3 కోట్ల రూపాయలతో మరో వారం రోజుల్లో ఆ ఆక్సిజన్ ప్లాంట్ ను రెడీ చేయబోతున్నారు.  వీలైనంత మందిని కాపాడేందుకు తన శక్తి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తానని సోనూసూద్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే సోనూసూద్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సహాయలను కొనసాగిస్తున్నాడు..


Post a Comment

Previous Post Next Post