మెగా హీరో మూవీ.. OTT రిలీజ్?


టాలీవుడ్ లో కూడా వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు డిజిటల్ వరల్డ్ లో విడుదల అవుతున్నాయి. పరిస్థితులను గమనిస్తే మరికొన్ని సినిమాలు కూడా OTTకే పరిమితం అయ్యేలా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ వలన ఇప్పట్లో సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేవు. ఒకవేళ తెరచినా కూడా జనాలు వచ్చేలా లేరు. 

ఇక మరొక దారి లేక చిన్న సినిమాలు చాలా వరకు OTT సంస్థల ఆఫర్స్ కు తలొగ్గక తప్పడం లేదు. ఇక మరో మెగా హీరో సినిమా సైతం డిజిటల్ రిలీజ్ కు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి. పులి వాసు డైరెక్ట్ చేసిన ఆ సినిమా గత ఏడాది రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. ఒకసారి ఫైనాన్షియల్ గా దెబ్బ పడగా మరోసారి కోవిడ్ దెబ్బ పడింది. ఇక ఆఫర్స్ వచ్చినప్పుడే OTT లో విడుదల చేయాలని నిర్మాత ఫిక్స్ అయినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post