Allu Arjun to team up with Boyapati again?


టాలీవుడ్ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ప్రస్తుతం అఖండ సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల వలన మరికొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడక తప్పలేదు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే అల్లు అర్జున్ కోసం మరొక పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇదివరకే మరో కథను అనుకున్నప్పటికి సెట్టవ్వలేదు. 

ఇక రీసెంట్ గా ఒక సింగిల్ లైన్ కాన్సెప్ట్ గురించి చెప్పగానే బన్నీ చాలా రిఫ్రెష్ గా ఉంటుందని ఒకే చెప్పాడట. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం అయ్యాకా మరొకసారి మాట్లాడుకుందామని కూడా అన్నారట. ప్రస్తుతం కోవిడ్ బ్రేక్ రావడంతో బోయపాటి ఆ కొత్త కథను ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ చేస్తున్నట్లు సమాచారం. అఖండ పూర్తయిన మరుక్షణమే బన్నీతో సినిమాను ఎనౌన్స్ చేయాలని బోయపాటి టార్గెట్ పెట్టుకున్నాడట. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనంతరం వరుసగా వేణు శ్రీరామ్ , కొరటాల ప్రాజెక్టులకు కామిట్మెంట్స్  ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలు పూర్తయిన తరువాతే బోయపాటి సినిమా ఉంటుందని టాక్.


Post a Comment

Previous Post Next Post