Subscribe Us

Raviteja Team rejects 40cr Offer?

Raviteja Team rejects 40cr Offer?

క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న రవితేజ మొత్తానికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ రావడంతో లాభాల్లో రవితేజకు షేర్స్ బాగానే వచ్చాయి.  ఇక ఆ సినిమా అనంతరం ఎలాగైనా మరొక బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఖిలాడి సినిమాతో రెడీ అవుతున్నాడు. 

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సడన్ గా కోవిడ్ దెబ్బ పడడంతో మళ్ళీ వాయిదా పడింది. దీంతో ఓటీటీ సంస్థలు ఆ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు దాదాపు 40కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు టాక్. సినిమా బడ్జెట్ కు అది కూడా దాదాపు డబుల్ ప్రాఫిట్ లాంటిదే. కానీ ఎందుకో నిర్మాతలు ఒప్పుకోలేదట. థియేట్రికల్ గానే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.


Post a Comment

0 Comments