Mahesh , Prabhas.. Both are ready.. But!!


ఆకాశం నీ హాద్దురా సినిమాతో అగ్ర హీరోలను ఆకర్షించిన లేడి డైరెక్టర్ సుధా కొంగర నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొదట తమిళ్ లో విజయ్ తో ప్రాజెక్ట్ సెట్టయినట్లు టాక్ వచ్చింది కానీ అది నిజం కాదని ఆమెనే తేల్చి చెప్పేశారు. అయితే సుధగారు మాత్రం మినిమమ్ హై రేంజ్ హీరోలతోనే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇక ఇటీవల ఆమె టాలీవుడ్ టాప్ స్టార్స్ ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో అయితే ఒక కథపై చర్చలు జరిపారు.  మహేష్ బాబుకు కూడా కథ వినిపించినట్లు గాసిప్స్ అయితే వచ్చాయి. స్టార్ హీరోలు సాధారణంగా డైరెక్టర్ తో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటేనే కథ వినడానికి ఒప్పుకుంటారు. ఇక సుధ కొంగరతో కూడా వర్క్ చేయాలని ప్రభాస్, మహేష్ లాంటి వాళ్ళు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఆమెతో వర్క్ చేయాలని అనుకుంటున్నారట. ఇక మహేష్, ప్రభాస్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ లేదు. వారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి సుధ ప్రస్తుతానికి మరొక హీరో కోసం వెతుకుతున్నట్లు టాక్.


Post a Comment

Previous Post Next Post