Subscribe Us

NTR gets Corona Positive!


టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. కరోనా పాజిటివ్ వచ్చినట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు. ఇప్పటివరకు RRR సినిమాకు వర్క్ చేసిన ప్రముఖులు అందరికి కూడా కరోనాను ఎదుర్కొన్నవారే. రాజమౌళి ఫ్యామిలీతో పాటు రామ్ చరణ్, అలియా భట్ కూడా కరోనాతో పోరాడి బయటపడ్డారు

ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కరోనా సోకినట్లు చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను బాగానే ఉన్నాను అంటూ తారక్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. నాతో పాటు ఫ్యామిలీ మొత్తం ఐసోలేషన్ లో ఉన్నట్లు చెబుతూ.. వైద్యుల సమక్షంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.  అలాగే తనతో ఇన్ని రోజులు కాంటాక్ట్ అయిన వారు అందరూ కూడా టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని తారక్ వివరణ ఇచ్చారు.


Post a Comment

0 Comments