ఫ్రాంక్లీ విత్ TNR ఇక లేరు.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక యాంకర్!


ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు.  యూట్యూబ్ ఇంటర్వ్యూలతో, టిఎన్ఆర్ భారీ ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. వందలాది మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆయన మిలియన్ల వీక్షణలను సంపాదించారు.

ఇక ఊహించని విధంగా సోమవారం ఉదయం టిఎన్ఆర్ కోవిడ్ -19 కి లొంగిపోవలసి వచ్చింది.  అతను మరణించడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు నెటిజన్లు షాక్ కు గురయ్యారు. తెలుగు యూ ట్యూబ్ వరల్డ్ లో ఇంటర్వ్యూ చేసే యాంకర్స్ లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న ఏకైనా యాంకర్ ఆయన. ఒక ఇంటర్వ్యూకి దాదాపు 1 లక్షకు పైగా పారితోషికం అందుకునేవారట. ఆ స్థాయిలో ఆయనకు డిమాండ్ ఉండేది. ఎలాంటి స్టార్స్ తో అయినా గంటల తరబడి ఇంటర్వ్యూ చేస్తూ అడియేన్స్ ను బోర్ కొట్టించేవాళ్ళు కాదు. నటుడిగా కూడా ఆయన కొన్ని సినిమాలతో మెప్పించిన విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post