Type Here to Get Search Results !

Venky in another Malayalam Remake?


టాలీవుడ్ ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ నారప్ప సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. తమిళ్ మూవీ అసురన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. ఇక మలయాళం హిట్ మూవీ దృశ్యం 2ను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పార్ట్ ను కూడా వెంకీ ముగించేశాడు.

అయితే త్వరలో మరో మలయాళం కథను తెలుగులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. పృథ్వీరాజ్ - సూరజ్ వెంజరమూడు నటించిన యాక్షన్ డ్రామా కోసం వెంకీ ఇటీవల సురేష్ బాబుతో చర్చలు జరిపాడట. గతంలోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది కానీ హీరో పేరు పెద్దగా వినిపించలేదు. ఇక ఇప్పుడు వెంకీ పేరు వినిపిస్తుండడంతో ఆయనైతేనే కరెక్ట్ గా సెట్టవుతారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో మరొక పాత్ర కోసం ఏ హీరోను సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies