Panja Vaishnav Tej with another Hit Director!
Tuesday, May 04, 2021
0
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన అలా హిట్టయ్యిందో లేదో వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా మొదటి సినిమాతో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా వైష్ణవ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. నిజంగా మెగా ఫ్యామిలీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఈ రేంజ్ లో మొదటి సినిమాతో హిట్టు కొట్టలేదు.
ఇక ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేసిన వైష్ణవ్ తేజ్ రీసెంట్ గా ఆదిత్య వర్మ డైరెక్టర్ గిరిశయతో మరో సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మైత్రి మూవీ మేకర్స్ లో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వగా అందులో ఒక సినిమాకు భీష్మ డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఛలో, భీష్మ హిట్టవ్వడంతో ఈ దర్శకుడికి మైత్రి మూవీ మేకర్ ఆఫర్ ఇవ్వగా కథలతో స్టార్ హీరోలను పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇక ఇప్పుడు వైష్ణవ్ కు సరితూగే కథతో రాబోతున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Tags