Subscribe Us

Music Director Thaman Increased Remuneration!!


టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేస్తున్న ఏకైక సంగీత దర్శకుడు థమన్. ఈ ఎడాది మొదట్లో క్రాక్ సినిమాతో మొదలైన థమన్ మోత వకీల్ సాబ్ వరకు బాగానే వర్కౌట్ అయ్యింది. వీలైనంత వరకు మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్న థమన్ కంటెంట్ కు తగ్గట్లుగానే మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం చేతిలో 8కి పైగా సినిమాలు ఉన్నాయి. అల.. వైకుంఠపురములో ముందు వరకు కూడా 1కోటి దగ్గరలో రెమ్యునరేషన్ అందుకున్న థమన్ ఆ హిట్టు అనంతరం కోటిన్నరకు దగ్గరలో వచ్చేసినట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలకు రెండుకోట్లకు పైగానే అందుకున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో రెండు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మరో సినిమా అలాగే మరికొంతమంది అగ్ర హీరోలతో కూడా కంటిన్యూగా మ్యూజిక్ అందిస్తున్నాడు. చూస్తుంటే దేవిశ్రీప్రసాద్ మూడు కోట్ల రెమ్యునరేషన్ ను కూడా త్వరలోనే క్రాస్ చేసేలా ఉన్నాడనిపిస్తోంది.


Post a Comment

0 Comments