కరోనా ఎఫెక్ట్.. 'హౌజ్ ఫుల్' బోర్డు!


హౌజ్ ఫుల్ బోర్డ్ అనేది ఒకప్పుడు థియేటర్ల ముందు ఎక్కువగా కనిపించేది. ఈ కాలంలో పెద్ద సినిమాలకు తప్పితే మిగతా సినిమాలకు అంతగా కనిపించడం లేదు. పెద్ద సినిమాలకు కూడా రెండు మూడు రోజులే అలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆ సంగతి అటుంచితే మొదటిసారి స్మశాన వాటిక గేటుకు హౌజ్ ఫుల్ బోర్డు కనిపించడం కలచి వేస్తోంది.

ప్రస్తుతం కోవిడ్ ఎక్కువవుతున్న తరుణంలో రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. మరణాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే స్మశాన వాటికల వద్ద డేడ్ బాడీలు కూడా క్యూ కడుతున్నాయి అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇటీవల బెంగుళూరులోని ఒక స్మశాన వాటిక  గేటుకు ఏకంగా హౌజ్ ఫుల్ బోర్డ్ తగిలించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీలైనంత వరకు ఈ కఠిన సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. మాస్క్ లు వేసుకొని బయటకు వెళితే కేవలం మనం జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఇతరులను కూడా రక్షించిన వాళ్ళం అవుతాం. Please Stay Home, Stay Safe.


Post a Comment

Previous Post Next Post