Mahesh to romance Sridevi Daughter?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా లాంటి విభిన్నమైన సినిమాల అనంతరం వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక దర్శకుడు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి.

ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేసినట్లుగా టాక్ వస్తోంది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించని జాన్వీ ఆ మధ్యలో పలు అవకాశాలు వచ్చినా కూడా ఓకే చెప్పలేదు. ఇక ఇప్పుడు మహేష్ బాబు కోసం ఆమెను సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఆ బ్యూటీ ఈ ఆఫర్ ను ఏ మాత్రం మిస్ చేసుకోదని చెప్పవచ్చు. మరి ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.


Post a Comment

Previous Post Next Post