Subscribe Us

Vijay Devarakonda Birthday Surprise!!


రౌడి స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది. దర్శకుడు పూరి ఎప్పటిలనే శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నాడు.

కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే టీజర్ కూడా వచ్చి ఉండేది. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది. ఇక సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయాలనుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ ఎఫెక్ట్ పడకుండా దర్శకుడు షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం.


Post a Comment

0 Comments