Subscribe Us

Vijay Deverakonda in another Bollywood movie!


టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ లైగర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ పాన్ ఇండియా సినిమాకు కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ సినిమా రాకముందే విజయ్ మరో బాలీవుడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. 

కరణ్ జోహార్ సలహా మేరకు కత్రినా కైఫ్ కు సంబంధించిన ఒక బిగ్ ప్రాజెక్టులో మేకర్స్ విజయ్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. కత్రినా కైఫ్ లీడ్ రోల్ లో సినిమా చేయబోతున్నట్లు గత ఎడాది నుంచి టాక్ వస్తోంది. ఇక అందులో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక త్వరలోనే అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.


Post a Comment

0 Comments