Prabhas's Chathrapathi remake halted in the middle!


బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో సంతోషంగా ఛత్రపతిని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలాగైనా బాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకోవాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. బెల్లంకొండ తెలుగు సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. 

అయితే అదే నమ్మకంతో డైరెక్ట్ గా హిందీ సినిమా చేయాలని పెన్ స్టూడియోస్ తో చేతులు కలిపాడు. ఇక దర్శకుడిగా వివి.వినాయక్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే అనుకోని విధంగా ఆ సినిమా ఆగిపోయినట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో సినిమా చేయడం చాలా కష్టమని నిర్మాతలు ఓపెన్ గానే చెప్పారట. దీంతో బెల్లంకొండ కర్ణన్ రీమేక్ రైట్స్ తీసుకొని ఆ సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. ఇక ఛత్రపతి రీమేక్ భవిష్యత్తులో ఉంటుందా ఉండదా ? అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే ఈ హీరోనే క్లారిటీ ఇవ్వాలి.


Post a Comment

Previous Post Next Post